- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్తి పన్ను టార్గెట్ రూ.3 వేల కోట్లు.. జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్
జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తిపన్నుకు సంబంధించిన అన్ని వివరాలు ఆన్‌లైనేలోనే ఉంటాయని.. 2025లో ఆస్తి పన్ను టార్గెట్ రూ.3వేల కోట్లుగా నిర్ణయించామని కమిషనర్ కర్ణన్ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తిపన్నుకు సంబంధించిన అన్ని వివరాలు ఆన్‌లైనేలోనే ఉంటాయని.. 2025లో ఆస్తి పన్ను టార్గెట్ రూ.3వేల కోట్లుగా నిర్ణయించామని కమిషనర్ కర్ణన్ తెలిపారు. 2025లో జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా విస్తరించిందని, 300వార్డులు, 60సర్కిళ్లు, 12 జోన్లకు పెరిగిందని, శానిటేషన్‌పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు చెప్పారు. 2025లో చేపట్టిన అంశాలను బుధవారం జీహెచ్ఎంసీ పన్వర్ హాల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు అనురాగ్ జయంతి, హేమంత్ కేశవ్ పాటిల్, అపూర్వ చౌహన్, రఘుప్రసాద్, అడిషనల్ ఎస్పీ నర్సింహా రెడ్డి ఉన్నారు.
ఆదాయంపైనే..
జీహెచ్‌ఎంసీ ప్రధాన ఆర్థిక వనరుల్లో ఒకటైన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ఈసారి ఆశాజనకంగానే అవుతున్నట్లు కమిషనర్ వెల్లడించారు. ముఖ్యంగా చాలా కాలంగా ప్రాపర్టీ ట్యాక్స్ పెంచకుండానే ప్రతి ఏటా రూ.150 కొట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు ట్యాక్స్ కలెక్షన్ ను పెంచుకుంటున్న జీహెచ్ఎంసీ ఆస్తుల వివరాలను పారదర్శకంగా సేకరించేందుకు గత సంవత్సరం జూలై మాసంలో ఆస్తులపై జియోగాఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే (జీఐఎస్)సర్వేను ప్రారంభించామని చెప్పారు. 14 లక్షల జీఐఎస్ మ్యాపింగ్ చేస్తే లక్ష ప్రాపర్టీల నుంచి ఏలాంటి ఆస్తిపన్ను రావడంలేదని గుర్తించినట్టు చెప్పారు. దీంతోపాటు టీజీఎస్ఫీడీసీఎల్ డేటా ఆధారంగా వాణిజ్య కేటగిరిలో ఉన్న ఆస్తులను గుర్తించిన వాటికి సంబంధించిన ఆస్తిపన్నును సవరించినట్టు చెప్పారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.1512.54 కోట్ల ఆస్తి పన్ను వసూలైందని, గతేడాదితో పోలిస్తే రూ.121 కోట్లు అదనంగా వసూలైందని కమిషనర్ వివరించారు. అయితే ఈ ఏడాదిలో టార్గెట్ రూ.3వేల కోట్లు వసూలు చేయాలని నిర్ణయించామని, విలీన 27 మున్సిపాలిటీల్లోని ప్రాంతాల నుంచి రూ.800 కోట్ల వరకు వసూలయ్యే అవకాశముందని తెలిపారు.
టౌన్ ప్లానింగ్ ద్వారా..
టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా 2024లో రూ.1114.24కోట్ల ఆదాయం వస్తే, 2025లో రూ.1272.36 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది కంటే రూ.158.12కోట్ల ఆదాయం ఎక్కువగా వచ్చింది. 2024లో 11,855 బిల్డింగ్ పర్మిషన్స్, 2125 ఆక్యూపెన్సీ సర్టిఫికెట్ల జారీచేస్తే 2025లో 11,166 బిల్డింగ్ పర్మిషన్స్, 2401 ఆక్యూపెన్సీ సర్టిఫికెట్లు జారీచేశారు. దీంతోపాటు 2024లో 69హైరైజ్డ్ బిల్డింగ్, 2025లో 103 హైరైజ్డ్ బిల్డింగ్ పర్మిషన్లు జారీ చేశారు.
శానిటేషన్ నిర్వహణపై ఫోకస్..
గ్రేటర్ లో శానిటేషన్ నిర్వహణపై ఫోకస్ పెట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జీహెచ్ఎంసీకి 6వ ర్యాంక్ వచ్చింది. జవహర్‌నగర్‌లో చెత్తతో కరెంటు తీసే ప్లాంట్, మరో 1000 టన్నుల వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్ కూడా రెడీ అయింది. ఇప్పటికే చెత్తతో విద్యుత్ తయారు చేసేందుకు 24 మెగా వాట్ల ప్లాంట్ నడుస్తుండగా, మరో 24 మెగావాట్ల సామర్థ్యం కల్గిన మరో ప్లాంట్ ను రెఢీ చేస్తున్నారు. దీంతో ఏకంగా చెత్తతో 48 మెగావాట్ల విద్యుత్ ను తయారు చేస్తున్న ఏకైక నగరంగా హైదరాబాద్ దేశంలోనే మొట్టమొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. హైదరాబాద్ నగరాన్ని మరింత క్లీన్ అండ్ గ్రీన్ గా తీర్చిదిద్దటంలో పౌరులను కూడా భాగస్వాములను చేయాలని, వారికి చెత్త పై అవగాహన పెంచేందుకు రోడ్ల మీద చెత్త వేస్తే మాత్రం భారీగా ఫైన్లు విధిస్తున్నారు. ఈ ఏడాది చివరి కల్లా ఈరకంగా ఫైన్లు విధించి జీహెచ్ఎంసీ ఏకంగా రూ. 2.34 కోట్లు వసూలు చేశారు. ప్రస్తుతం నగరంలో 'మెగా శానిటేషన్ డ్రైవ్' కొనసాగుతుందని, ఈ డ్రైవ్ జనవరి చివరి కల్లా కొనసాగించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. మీ ఏరియాలో పాత వాహానాలు, వినియోగించని ఎలాంటి మెటీరియల్ ఉన్నా, టోల్ ఫ్రీ నెంబర్ 040-21111111 లేదా, ఉంటే పేరుకుపోయి ఉన్నా, వాట్సప్ నెంబర్ 81259 66586 సమాచారమందిస్తే వెంటనే తరలిస్తారని కమిషనర్ వెల్లడించారు.






