- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్యాక్స్ కెలెక్షన్ రూ.2,558.80 కోట్లు
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(క్యూర్) పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో రికార్డు స్థాయిలో ప్రాపర్టీ కలెక్షన్ వచ్చింది.

ట్యాక్స్ కెలెక్షన్ రూ.2,558.80కోట్లు
గతేడాది కంటే రూ.520కోట్లు అధికం
టాప్ లో సీఎంసీ
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(క్యూర్) పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో రికార్డు స్థాయిలో ప్రాపర్టీ కలెక్షన్ వచ్చింది. 2025-26ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2558.80 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైంది. అంతకు ముందటి సంవత్సరం (2024-25)లో పాత జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు రూ. 2038.46 కోట్ల ట్యాక్స్ వసూలైంది. గతంతో పొలిస్తే రూ.520కోట్లు అధికంగా వసూలైంది. నవంబర్ 25వ తేదీన కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 27 పట్టణ స్థాని సంస్థలను విలీనం చేయటంతో ఇటీవలే ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో వసూలైన రూ. 2558.80 తో అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2024-25 ఆర్థిక సంవత్సరంలో కలెక్షన్ అయిన రూ. 2038.46తో పోల్చితే తాజాగా సుమారు రూ. 520.34 కోట్ల కలెక్షన్ పెరిగింది. పెరిగిన పరిధి కారణంగానే ట్యాక్స్ పెరిగిందని అధికారులు భావిస్తున్నారు. అయితే విలీనమైన 27 పట్టణ స్థానిక సంస్థల్లో సాధారణంగా రూ.500కోట్లకుపైగా వసూలయ్యేది. మూడు కార్పొరేషన్ల పరిధిలో వసూలైన రూ.2,558కోట్లలో రూ.500కోట్లకుపైగా విలీనం మున్సిపాలిటీలకు సంబంధించినదేనని సీడీఎంఏ అధికారులు చెబుతున్నారు.
టార్గెట్ రూ.2,762కోట్లు…
క్యూర్ పరిధిలోని జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ ఏరియాల్లో 28,80,260 పీటీఎన్స్ ఉన్నాయి. వీటి ద్వారా రూ.8,734కోట్లు రావాల్సి ఉందని అధికారులు అంచనా వేశారు. కానీ టార్గెట్ మాత్రం రూ.2,762కోట్లు పెట్టుకున్నారు. అయితే మార్చి31 నాటికి రూ.2,558.80కోట్లు వసూలైంది.
క్యూర్ ఏరియాలో
కార్పొరేషన్ పీటీఎన్స్
జీహెచ్ఎంసీ 11,45,321
సీఎంసీ 9,43,432
ఎంఎంసీ 7,91,507
మొత్తం 28,80,260
టాప్ లో సీఎంసీ
ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ) ఏకంగా రూ. 1000.36 కోట్లు వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో జీహెచ్ఎంసీ రూ. 992.82 కోట్లు కాగా, మూడవ, చివరి స్థానంలో మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ రూ. 562.62 కోట్లు వసూలు చేసింది. మార్చి 31 ఒక్క రోజు కలెక్షన్ తోపాటు మార్చి నెల పరిశీలిస్తే రూ.203.20 కోట్లతో జీహెచ్ఎంసీ మొదటి స్థానంలో ఉంది. సీఎంసీ రూ. 143.69 కోట్లతో రెండో స్థానం, రూ. 107.09 కోట్లతో ఎంఎంసీ మూడో స్థానంలో నిలిచింది. మార్చి 31వ రోజు 24 గంటల వ్యవధిలో జీహెచ్ఎంసీ రూ.84.70కోట్లు వసూలు చేసింది.
ఎర్లీబర్డ్ షురూ..
ఈనెల 1వ తేది నుంచి ఎర్లీబర్డ్ స్కీమ్ ప్రారంభమైంది. ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించినవారికి 5శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్కీమ్ ను మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో అమలు చేస్తున్నారు. అయితే ఇక నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ఏ కార్పొరేషన్ పరిధిలోని ట్యాక్స్ వారికే వెళ్లనుంది. ఈ రాయితీ ప్రోత్సాహాకంగా ఇవ్వనున్నట్లు జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ ( రెవెన్యూ) రజనీకాంత్ రెడ్డి తెలిపారు.






