అతడు సీఎంగా ఉన్నంత కాలం హామీలు అమలు కావు.. కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

నిధులు విషయంలో తెలంగాణ (Telangana)కు కేంద్ర ప్రభుత్వం (Central Government) అన్యాయం చేసిందంటూ కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్స్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) ఫైర్ అయ్యారు.

అతడు సీఎంగా ఉన్నంత కాలం హామీలు అమలు కావు.. కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: నిధులు విషయంలో తెలంగాణ (Telangana)కు కేంద్ర ప్రభుత్వం (Central Government) అన్యాయం చేసిందంటూ కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్స్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మెదక్‌ (Medak)లో టీచర్స్‌తో మిట్ అండ్ గ్రీట్ (Meet & Greet) కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ (KCR), ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాలనలో మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్రం అప్పులపాలై రోడ్డున పడిందని కామెంట్ చేశారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ (KCR) రూ.9 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు.

ఆ తరువాత వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అప్పులు, భూముల అమ్మకాలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారని ధ్వజమెత్తారు. భవిష్యత్తు అవసరాలకు ప్రభుత్వం భూములు అనేవే లేకుండా అన్ని అమ్మేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ (Telangana)కు ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ఏం ఇచ్చారని కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీలు అడుగతున్నాయని.. ఏ ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్న ప్రతి పేదవాడికి కేంద్రం సాయం చేస్తుందని గుర్తు చేశారు. నిరుపేదల కడుపు నింపేందుకు ఉచితంగా బియ్యం ఇస్తుంటే.. రేషన్ కార్డు (Ration Card)పై రేవంత్ సర్కార్ బొమ్మ వేసుకుంటుందని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకంపై తమ ఆనవాళ్లు లేకుండా రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసిందని అన్నారు. సీఎంగా రేవంత్ ఉన్నంత కాలం హామీలు అమలు కావని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు.

Next Story