- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫిల్మ్‌ఛాంబర్ ఎన్నికలు: ప్రోగ్రెసివ్ ప్యానల్ ఘన విజయం
ఫిల్మ్‌ఛాంబర్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానల్ ఘన విజయం సాధించింది...

దిశ, వెబ్ డెస్క్: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో(Telugu Film Chamber of Commerce Election) ప్రోగ్రెసివ్ ప్యానల్(Progressive panel) జయకేతనం ఎగరవేసింది. మొత్తం 44 కార్యవర్గ స్థానాలకు జరిగిన ఎన్నిల్లో ప్రోగ్రెసివ్ ప్యానల్ నుంచి 28 మంది, మన ప్యానల్ నుంచి 15 మంది విజయం సాధించారు.
పూర్తి ఫలితాలు ఇవే..
ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరిగాయి. మొత్తం 3,287 ఓట్లకు గాను ఈ ఎన్నికల్లో 1421 ఓట్లు మాత్రమే నమోదు అయ్యాయి. మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని కొనసాగించారు. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల పూర్తి ఫలితాలను ప్రకటించారు.
ఎగ్జిబిటర్స్ సెక్టార్‌లో జరిగిన ఎన్నికల్లో 14 మంది ప్రోగ్రెసివ్ ప్యానల్ సభ్యులు, మన ప్యానల్ నుంచి ఇద్దరు సభ్యులే గెలుపొందారు.
డిస్ట్రిబ్యూటర్ సెక్టార్‌లో ప్రోగ్రెసివ్ ప్యానల్ నుంచి 8 మంది ఈసీ మెంబర్లుగా విజయం సాధించగా.. ముగ్గురు మన ప్యానల్ సభ్యులు గెలుపొందారు. ఒక స్థానం టై అయింది.
ప్రొడ్యూసర్స్ సెక్టార్‌లో మన ప్యానల్ నుంచి ఏడుగురు, ప్రొగ్రెసివ్ నుంచి ఐదుగురు విజయం సాధించారు.
స్టూడియోస్ సెక్టార్‌లో ప్రొగ్రెసివ్ నుంచి ఒకరు, మన ప్యానల్ నుంచి ముగ్గురు గెలుపొందారు.
అయితే అధ్యక్ష, ఉపాధ్య, కార్యదర్శి వంటి పదవులకు ఎన్నిక జరగనుంది. చాంబర్ ఎన్నికల్లో గెలిచిన సభ్యులు ఎన్నుకుంటారు. ప్రోగ్రెసివ్ ప్యానల్ మెజార్టీ ఉండడంతో కీలక పదవులన్నీ ఆ ప్యానల్ కే దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలో కొత్త కార్యవర్గం కానుంది. దీంతో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై కొత్త కార్యవర్గం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.






