- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్‌ను జాతిపిత అంటే ఒప్పుకోను: కోదండరాం
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై ప్రొఫెసర్ కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై ప్రొఫెసర్ కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ను జాతిపిత అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోను అని అన్నారు. సెంటిమెంట్‌ను రాజకీయాల కోసం వాడుకోవడం ఏంటని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ ఏనాడూ పట్టించుకోలేదని గుర్తుచేశారు. వ్యక్తిగత అవసరాల కోసం తెలంగాణ అస్థిత్వాన్ని వాడుకోవడం చాలా పెద్ద తప్పు అని అన్నారు. జాతిపిత అనే బిరుదు ఎవరికి వారు పెట్టుకోవడం కాదు.. అది ప్రజలు ఇవ్వాలని చెప్పుకొచ్చారు.
జయశంకర్ జాతిపిత
ఇదిలా ఉంటే.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి సైతం జాతిపిత బిరుదుపై మాట్లాడారు. కేసీఆర్ ఎవరికి జాతిపిత అంటూ ప్రశ్నించారు. వేరే వాళ్లు ఫోన్లు వినే వాళ్లు జాతిపితలా అంటూ కామెంట్ చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియా దేవత అని.. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన జయశంకర్ జాతిపిత అన్నారు.
హరీష్ రావు కౌంటర్
మరోవైపు సీఎం కామెంట్స్‌కు బీఆర్ఎస్ నేత హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. జాతిపిత అంటే రేవంత్‌కు తెలుసా అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డ చరిత్ర కేసీఆర్‌ది అని గుర్తుచేశారు. తెలంగాణ కోసం రేవంత్‌రెడ్డి ఎప్పుడైనా కొట్లాడారా? అని నిలదీశారు. అయితే.. తెలంగాణ జాతిపిత అంశంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం మరికొన్ని రోజులు ఉండటంతో ఈ అంశం రాజకీయంగా మరింత రగడకు కారణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.






