- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలన.. కోదండరాం ఇచ్చిన మార్కులివే
రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలన.. కోదండరాం ఇచ్చిన మార్కులివే

దిశ, తెలంగాణ బ్యూరో: రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి పాలనకు తాను డిస్టింక్షన్‌తో మార్కులు వేస్తున్నట్లుగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల్లో కొన్నింటిని మరింత మెరుగు పర్చుకోవాలన్నారు. శనివారం కోదండరాం ‘దిశ’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రాకపోవడంపై ఆయన స్పందిస్తూ కేసీఆర్ రాజకీయ శైలి అలాగే ఉంటుందని, తాను అమలు పర్చే రాజకీయ వ్యూహాలను ఒక దగ్గర కూర్చొని నిర్వహించే వైఖరి మొదటి నుంచి ఆయనకు ఉన్నదన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే తెలంగాణ రాజకీయాల్లో మంచి వాతావరణం నెలకొంటుంది. కవిత కేసీఆర్ ఫ్యామిలి నుంచి బయటకు రావడం ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను చూపెడుతోందని, ఆమె ప్రశ్నలకు బీఆర్ఎస్ నేతలే సమాధానం చెప్పాలన్నారు. తమ పార్టీ కాంగ్రెస్ కు మిత్రపక్షంగా ఉన్నదని, రాబోయే ఎన్నికల్లో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నామని, నామినేటెడ్ పదవులు కూడా ఇస్తారనే తమ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయని కోదండరాం తెలిపారు. తుమ్మడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తామని ప్రభుత్వం చేపట్టం సరైనదేనని, కూలిన మేడిగడ్డ మరమ్మత్తులు నిపుణుల సూచనల మేరకు ప్రభుత్వం చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన హైడ్రాతో చెరువుల పునరుద్దరణ జరుగుతోందని, ప్రజల్లోనూ దీనిపైన మరింత అవగాహాన కల్పించాల్సిన బాద్యత ప్రభుత్వానిదే అన్నారు. ఇక మూసీ ప్రక్షాళనలో కూల్చివేతల కంటే అక్కడ నివసిస్తున్న ప్రజలకు పునరావాసం, ప్రక్షాళన మంచిదే అన్న భరోసా కల్పించి ఉంటే ఆ ప్రాజెక్టు ఉద్దేశం ప్రజలకు అర్ధం అయ్యేదని, అలా జరగకపోవడంతో గందరగోళం నెలకొన్నదని కోదండరాం చెప్పారు. హిల్ట్ పాలసీ ఉద్దేశం మంచిదేనని, ఆ పాలసీ ద్వారా కాలుష్యకారక పరిశ్రమల తరలింపు జరుగుతుందని, ఆ భూములను ప్రజా వినియోగంలోకి తీసుకురావొచ్చారన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలు ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ బాధ్యతగా ఉందన్నారు. బీసీ రిజర్వేషన్లపైన రాష్ట్ర ప్రభుత్వం తన పరిధి మేరకు వ్యవహారించిందని, 9వ షెడ్యూల్ లో చేర్చే అంశాన్ని బీజేపీ తీసుకోవాలన్నారు. బీసీ రిజర్వేషన్లలో నెలకొన్న సందిగ్దత వాతావరణం ఎక్కువ కాలం కొనసాగడం సరికాదని, బీసీల్లో భరోసా కలిగించే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహారించాలని కోదండరాం సూచించారు.






