ఓయూ ఆర్ట్స్ కాలేజ్ మెట్లు ఎక్కిన మొదటి సీఎం రేవంత్ రెడ్డి: ప్రొ. కాశీం

by Ajay Maddhiboyina |

ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజి మెట్లు ఎక్కిన మొదటి సీఎం రేవంత్ రెడ్డి అని ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొ. కాశీం అన్నారు.

ఓయూ ఆర్ట్స్ కాలేజ్ మెట్లు ఎక్కిన మొదటి సీఎం రేవంత్ రెడ్డి: ప్రొ. కాశీం
X

దిశ‌, వెబ్ డెస్క్: ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజి మెట్లు ఎక్కిన మొదటి సీఎం రేవంత్ రెడ్డి అని ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొ. కాశీం అన్నారు. చరిత్రలో 1965లో దేశ ప్రధాని ఇందిరా గాంధీ ఆర్ట్స్ కాలేజీ మెట్లు ఎక్కారని అన్నారు. ఆ తరవాత ఆర్స్ట్ కాలేజీ మెట్లు ఎక్కిన మొదటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిలిచారని చెప్పారు. రేవంత్ రెడ్డి 25ఏళ్ల క్రితం గీత‌మ్మ‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడ‌ని.. కానీ ఇటీవ‌ల మ‌రో అమ్మాయిని ప్రేమిస్తున్న‌డ‌ని అన్నారు. విద్య అనే అమ్మాయిని రేవంత్ రెడ్డి ప్రేమిస్తున్నార‌ని స‌ర‌దాగా చెప్పారు. ఆయ‌న ప్ర‌తి ఉప‌న్యాసంలోనూ విద్య గురించి మాట్లాడుతున్నార‌ని అన్నారు.

ఆ విద్య‌పై ప్రేమ‌ను రేవంత్ రెడ్డి గొంతులో ప్రాణం ఉన్నంత వ‌ర‌కు కొన‌సాగించాల‌ని కోరుకుంటున్నామ‌ని చెప్పారు. ఓయూకు రావాల‌ని ఒక రిక్వెస్ట్ పెట్ట‌గా వ‌స్తున్నా మీరు ఏర్పాట్లు చేసుకోండ‌ని చెప్పార‌ని అన్నారు. ఇచ్చిన మాట ప్ర‌కారం యూనివ‌ర్సిటీకి వ‌చ్చార‌ని, రూ.1000 కోట్లు విశ్వ‌విద్యాల‌యానికి ప్ర‌క‌టించార‌ని ఆనందం వ్య‌క్తం చేశారు. చాలా మంది ముఖ్య‌మంత్రులు హామీలు ఇచ్చి నిలబెట్టుకోలేదని కానీ మూడు నెల‌ల్లోనే జీవో తీసుకువ‌చ్చార‌ని అన్నారు. వెయ్యికోట్ల‌తో జీవో ఇచ్చారు కాబ‌ట్టి 24నెల‌ల్లోనే అంద‌మైన భ‌వ‌నాలు నిర్మించాల‌ని కోరారు. అంతే కాకుండా నాణ్య‌మైన విద్య బోధించేందుకు 1000 మంది అధ్యాప‌కుల‌ను నియ‌మించేందుకు 15రోజుల్లో ప్రాసెస్ మొద‌లు పెట్టార‌ని అన్నారు.

Next Story