Dil Raju: ‘నన్ను ఎవరూ టార్గెట్ చేయలేదు’ ఐటీ రైయిడ్స్‌పై దిల్ రాజు హాట్ కామెంట్స్

by Ramesh N |
Dil Raju: ‘నన్ను ఎవరూ టార్గెట్ చేయలేదు’ ఐటీ రైయిడ్స్‌పై దిల్ రాజు హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఐటీ దాడులపై ప్రముఖ నిర్మాత, టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు స్పందించారు. ఈ మేరకు ఆయన శనివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ అధికారులు నిన్న తనతో మాట్లాడినట్లు తెలిపారు. ఐదేళ్లుగా తాము ఎక్కడా పెట్టుబడులు పెట్టలేదన్నారు. ఐటీ అధికారులు అడిగిన వివరాలు అన్నీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. సినిమాకు సంబంధించిన లావాదేవీలు అడిగారని, అకౌంట్ బుక్స్ చెక్ చేసి స్టేట్మెంట్ తీసుకున్నారని స్పష్టం చేశారు. 90 శాతం టికెట్స్ ఆన్‌లైన్ వేదికగా బుక్ చేస్తున్నారని, ఇక బ్లాక్ మనీ సమస్యే లేదన్నారు. తన దగ్గర ఒక రూ.5 లక్షలు, శీరిష్ దగ్గర రూ.4.50 లక్షలు, తన కుతురు ఇంట్లో ఒక రూ.6 లక్షలు, ఆఫీస్‌లో రూ.2.50 లక్షలు.. మొత్తం మా అందరి దగ్గర కలిపి రూ.20 లక్షల కంటే తక్కువే క్యాష్ రూపంలో ఉందన్నారు.

లంగ్స్ ఇన్ఫెక్షన్ వల్ల కాఫ్ ఎక్కువ అయితే మా అమ్మను హాస్పిటల్‌కు పంపించినట్లు తెలిపారు. ఇప్పుడు తను బాగానే ఉన్నారని చెప్పారు. తమపై తప్పుడు వార్తలు రాయొద్దని మీడియాను కోరారు. తనను ఎవరూ టార్గెట్ చేయలేదని, వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఐటీ తనిఖీలు సాధారణమని మీడియా అడిగిన ప్రశ్నలకు హాట్ కామెంట్స్ చేశారు. ఐటీ సోదాలు నా ఒక్కడిపైనే మాత్రమే జరగలేదు కాదా.. నిబంధనల ప్రకారమే వాళ్లు సోదాలు జరిపారన్నారు. 18 ఏళ్ల తర్వాత మా ఇళ్లలో సోదాలు జరిపారని అన్నారు.



Next Story

Most Viewed