- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెరుగైన చికిత్స కోసం విదేశాలకు శ్రీతేజ తరలింపు..?.. ఎంత ఖర్చు అయిన భరిస్తానని తేల్చి చెప్పిన నిర్మాత బన్నీ వాసు!
కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీతేజ్‌ను నిర్మాత బన్నీ వాసు పరామర్శించారు.....

దిశ, వెబ్ డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన ‘పుష్పా-2’(Pushpa-2) సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్(Hyderabad) సంధ్యా థియేటర్(Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాటలో బాలుడు శ్రీతేజ్(Sritej) తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం శ్రీతేజ్ నగరంలోని కిమ్స్ హాస్పిటల్(Kims Hospital)లో చికిత్స పొందుతున్నారు. క్రమక్రమంగా కోలుకోవడంతో చిన్నారిని పలువురు పరామర్శిస్తున్నారు. ఇప్పటికే దిల్ రాజు(Dil Raju)తో పాటు అల్లు అరవింద్(Allu Aravind) పరామర్శించారు. తాజాగా నిర్మాత బన్నీ వాస్(Producer Bunny Vas) కిమ్స్‌కు వెళ్లారు. చిన్నారి శ్రీతేజ్‌ను పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్యం కుదటపడటంతో సంతోషం వ్యక్తం చేశారు. శ్రీతేజ్‌కు ఇంకా మెరుగైన వైద్యం అందించడానికి ఫారెన్ తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు బన్నీ వాస్ తెలిపారు.
కాగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ తల్లి మృతి చెందారు. చిన్నారి శ్రీతేజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాలుడు శ్రీతేజ్ కు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే తొక్కిసలాటకు సంబంధించిన కేసులో హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు. ఇలా విడుదలైన బన్నీని పలువురు సినీ ప్రముఖులు పరామర్శించడం విమర్శలకు దారి తీసింది. అల్లు అర్జున్‌ను పరామర్శించి.. చిన్నారి శ్రీతేజ్‌ను పరామర్శించకపోవడంపై పలువురు వ్యతిరేకించారు. అటు ప్రభుత్వం కూడా తప్పుబట్టింది. దీంతో శ్రీతేజ్‌ను పలువురు సినిమా ప్రముఖులు పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శ్రీతేజ్‌కు పుష్పా-2 సినీ నిర్మాతలు, డైరెక్టర్ సుకుమార్ ఆర్థిక సాయం అందించారు. అయితే నిర్మాత బన్నీ వాసు ద్వారా అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు శ్రీతేజ్ ఆరోగ్య వివరాలు తెలుసుకుంటున్నారు. తాజాగా కిమ్స్‌లో శ్రీతేజ్‌ను బన్నీవాస్ పరామర్శించారు. అయితే శ్రీతేజ్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఫారెన్ తీసుకెళ్లాలని నిర్ణయించారు.






