Minister Talasani : నియోజకవర్గాల్లో సమస్యలు పేరుకుపోతున్నాయ్ : మాజీ మంత్రి తలసాని

by Y. Venkata Narasimha Reddy |

గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad)పరిధిలోని నియోజకవర్గా(Cconstituencies)ల్లో సమస్యలు పేరుకుపోతున్నాయని వాటిపై జీహెచ్ఎంసీ కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav)తెలిపారు.

Minister Talasani : నియోజకవర్గాల్లో సమస్యలు పేరుకుపోతున్నాయ్ : మాజీ మంత్రి తలసాని
X

దిశ, వెబ్ డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad)పరిధిలోని నియోజకవర్గా(Cconstituencies)ల్లో సమస్యలు పేరుకుపోతున్నాయని వాటిపై జీహెచ్ఎంసీ కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav)తెలిపారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) సహా గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS MLAS)లతో కలిసి కమిషనర్(Commissioner)ను కలిసి వినతి పత్రం(Moomerandum)అందించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

నియోజవర్గాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా సమస్యలు ఉన్నాయని..అయినప్పటికి మేం బాధ్యతతో వ్యహరించి గొడవలు, ఆందోళనలకు దిగలేదన్నారు. నియోజక వర్గంలో పనులు ఎందుకు చేపట్టడం లేదని కమిషనర్ ను అడిగామని, వీలైనంత త్వరలో పనులు చేస్తారా లేదా చెప్పాలని, చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నారో చెప్పాలని అడిగామన్నారు. ఒక వేళ చేయాలి అనుకుంటే ఏఏ కార్యక్రమాలు చేస్తున్నారో చెప్పాలని కోరడం జరిగిందన్నారు.

మా కార్పోరేటర్లకు సోమ, మంగళ వారాలలో ఏదో ఒక రోజు కమిషనర్ ను కలిసేందుకు అపాయింట్మెంట్ అడగడం జరిగిందన్నారు. ప్రోటోకాల్ సమస్య మరో ప్రధాన అంశంగా ఉందన్నారు. అల్వాల్ ప్రాంతంలో సీఎస్ఆర్ ఫండ్ కింద చేపట్టిక కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేను కూడా ఆహ్వానించలేదని, నెంబర్లను బ్లాక్ చేయడం.. కాల్స్ చేస్తే తీయకపోవడం జరుగుతుందని ఈ సమస్యలను కమిషనర్ కు వివరించామని తెలిపార. ప్రొటోకాల్ ను ఖచ్చితంగా పాటించాలని లేదంటే సహించేది లేదన్నారు.

Next Story