- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delimitation: మీ సూచనలు భేష్… సీఎం రేవంత్ రెడ్డికి ప్రియాంక గాంధీ అభినందనలు
డీలిమిటేషన్ బిల్లుపై పోరాడుతున్న సీఎం రేవంత్ రెడ్డిని ప్రియాంక గాంధీ అభినందించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రతిపాదనల విషయంలో బీజేపీ విధానంలోని లోపాలను ప్రజల ముందుంచడంతో పాటు ప్రత్యామ్నాయ సూచనలు చేసి దక్షిణాది రాష్ట్రాల ఐక్యతకు కృషి చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (Revanth Reddy) ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) నుంచి ప్రశంసలు అందాయి. ఢిల్లీలో ప్రియాంక గాంధీని శనివారం ఉదయం రేవంత్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా దక్షిణ భారత దేశంతో పాటు ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలను బలహీనపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రజాస్వామ్య విరుద్ధ రాజ్యాంగ సవరణను అడ్డుకోవడం.... దేశ భవిష్యత్తును కాపాడేందుకు ప్రతిపక్ష శక్తులను ఏకతాటిపైకి తీసుకురావడంలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు మద్దతుగా నిలిచినందుకు తెలంగాణ ప్రజల తరఫున ప్రియాంక గాంధీకి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే ఏకగ్రీవంగా ఆమోదం పొందిన మహిళా బిల్లుతో సంబంధం లేకుండా, మహిళా సాధికారత పేరుతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, అనవసరమైన డీలిమిటేషన్ అజెండాను ముందుకు తీసుకువచ్చారని ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ సీఎంతో అన్నారు.






