IAS Priyanka: ఐఅండ్‌‌పీఆర్‌ స్పెషల్‌ కమిషనర్‌‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రియాంక

by Ramesh Naini |   (  Updated:2025-06-16 07:06:28  IST  )

తెలంగాణ ప్రభుత్వంలో సమాచార పౌర సంబంధాల (ఐఅండ్‌పీఆర్) శాఖ స్పెషల్ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారిని సీహెచ్ ప్రియాంక నియమితులైన విషయం తెలిసిందే.

IAS Priyanka: ఐఅండ్‌‌పీఆర్‌ స్పెషల్‌ కమిషనర్‌‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రియాంక
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వంలో సమాచార పౌర సంబంధాల (ఐఅండ్‌పీఆర్) శాఖ స్పెషల్ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారిని (Priyanka Chekka) సీహెచ్ ప్రియాంక నియమితులైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ (సోమవారం) మాసబ్‌ట్యాంక్‌లోని ఐఅండ్‌పీఆర్ ఆఫీస్‌లో ఐఅండ్‌‌పీఆర్‌ స్పెషల్‌ కమిషనర్‌‌గా భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆఫీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే జర్నలిస్టు సంఘాలు విషెస్ తెలియజేశాయి. కాగా, సీహెచ్ ప్రియాంక మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి (Municipal Administration & Urban Development - MA & UD) శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేశారు.

ఇటీవల దాదాపు 33 మంది ఐఏఎస్‌లను కాంగ్రెస్ ప్రభుత్వం బదిలీలు చేసిన విషయం తెలిసిందే. బదిలీల్లో భాగంగా ప్రియాంకను డిప్యూటీ సెక్రటరీ పదవి నుంచి ఐఅండ్‌‌పీఆర్‌ స్పెషల్ కమిషనర్ (I&PR Special Commissioner) పదవికి బదిలీ చేశారు. కాగా, ఎన్ఐటీ వరంగల్ నుంచి బీటెక్ పట్టా పొందిన అధికారిని.. ఐఏఎస్‌కు ముందు గోల్డ్‌మన్ సాచ్‌లో ప్రోగ్రామింగ్ అనలిస్ట్‌గా పనిచేశారు. మరోవైపు శాస్త్రీయ సంగీతంలో సైతం రాణించారు.

Next Story