సీఎం సభకు తరలిన ప్రైవేటు స్కూల్ బస్సులు.. ఆ పాఠశాలలకు అప్రకటిత సెలవే!

by Sathputhe Rajesh |   (  Updated:2023-09-16 03:05:46  IST  )

CM కేసీఆర్ శనివారం నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా ప్రైవేటు విద్యాసంస్థలకు అప్రకటిక సెలవులు ప్రకటించినట్లు అయ్యింది.

సీఎం సభకు తరలిన ప్రైవేటు స్కూల్ బస్సులు.. ఆ పాఠశాలలకు అప్రకటిత సెలవే!
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పలు ప్రైవేటు విద్యాసంస్థలకు అప్రకటిక సెలవులు ప్రకటించినట్లు అయ్యింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

ఈ సభకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుండి జనాన్ని తరలించేందుకు ప్రజా ప్రతినిధులు సన్నద్ధం అయ్యారు. ఈ మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జిల్లా, నియోజకవర్గ కేంద్రాలలో ఉన్న పలు ప్రైవేటు పాఠశాలల బస్సులను జనాన్ని తరలించేందుకు వినియోగిస్తున్నారు. ఉన్నత అధికారుల ఆదేశాలతో ఆర్టీవోలు ఆయా పాఠశాలల యాజమాన్యాలతో మాట్లాడి బస్సులను శుక్రవారం సాయంత్రానికి పలు గ్రామాలకు తరలించారు. దీనితో శనివారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రైవేటు పాఠశాలలకు అప్రకటితంగా సెలవులు ప్రకటించినట్లు అయ్యింది.

Next Story