ప్రైవేటు విద్యాసంస్థల కీలక నిర్ణయం.. మళ్లీ సమ్మెకు వెళ్తామని ప్రభుత్వానికి అల్టిమేటం

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-01 12:08:27  IST  )

రాష్ట్రంలోని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి.

ప్రైవేటు విద్యాసంస్థల కీలక నిర్ణయం.. మళ్లీ సమ్మెకు వెళ్తామని ప్రభుత్వానికి అల్టిమేటం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) బాకాయిల కోసం మరోసారి సమ్మె బాట పట్టనున్నట్లుగా ప్రకటించాయి. ఈనెల 12 లోగా బకాయిలు విడుదల చేయని పక్షంలో 13 నుంచి సమ్మెకు వెళ్తామని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలను ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. గత చర్చల సందర్భంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.1,200 కోట్ల మేర చెల్లిస్తామని ప్రకటించి దసర పండుగ నేపథ్యంలో రూ.200 కోట్లు మాత్రమే చెల్లించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 12 లోగా రూ.వెయ్యి కోట్లు చెల్లించి.. మిగిలిన బకాయిల చెల్లింపుపై క్యాలెండర్ ఇవ్వాలని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు క్యాలెండర్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించకపోతే.. అవసరమైతే విద్యార్థులతో కలసి ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి పిలుపునిస్తామని అల్టిమేటం జారీ చేశారు.

Next Story