- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Colleges closed: కాలేజీల బంద్ సస్పెన్స్.. ఈ రాత్రికి డిప్యూటీ సీఎంతో యాజమాన్యాల సమావేశం
రేపటి నుంచి కాలేజీల నిరవధిక బంద్‌కు ఫెడరేషన్ నేతలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని విద్యార్థులు, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు, మరోవైపు పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా రేపటి నుంచి కాలేజీల నిరవధిక (Colleges closed) బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాల ఫెడరేషన్ నేతలను ప్రభుత్వం చర్చలకు పిలిచింది. ఈ రోజు రాత్రి 7 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhattivikramrka)తో ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాల ఫెడరేషన్ నేతలు భేటీ కానున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై భట్టి వారితో చర్చించనున్నారు. రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని విద్యార్థులు, యాజమాన్యాలు ఎదురుచూస్తున్నాయి. చర్చల అనంతరం తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని కాలేజీల యాజమాన్యం తెలిపాయి. మరోవైపు రేపటి నుంచి కాలేజీలు బంద్ ఉంటుందా? లేదా? అని విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. డిప్యూటీ సీఎం భేటీ తర్వాత కాలేజీల బంద్ సస్పెన్స్ వీడనుంది.






