- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జైళ్లు రాహుల్ సంకల్పాన్ని అణచివేయలేవు.. అరెస్టును ఖండించిన సీఎం రేవంత్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఓట్ల జాబితా సవరణకు నిరసనగా ‘ఓటు చోరీ’ నినాదంతో కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్ష పార్టీల నేతలు చేపట్టిన మార్చ్ టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఓట్ల జాబితా సవరణకు నిరసనగా ‘ఓటు చోరీ’ నినాదంతో కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్ష పార్టీల నేతలు చేపట్టిన మార్చ్ టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ర్యాలీకి అనుమతి లేదని.. బారికేడ్లతో సంసద్ మార్గ్‌ను పోలీసులు మూసివేశారు. దీంతో వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విపక్ష ఎంపీలంతా నడిరోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని భావించిన ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర ఎంపీలను అరెస్ట్ చేసి ప్రత్యేక బస్సుల్లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలోనే వారి అరెస్ట్‌పై తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ‘X’ వేదికగా స్పందించారు. ప్రజాస్వామ్యయుతంగా ర్యాలీ చేస్తే పోలీసులు అడ్డుకోవడం ఏంటని ఫైర్ అయ్యారు. జైళ్లు రాహుల్ గాంధీ సంకల్పాన్ని అణచివేయలేవని.. విపక్ష సభ్యుల నోళ్లను మూయించలేవని ట్వీట్ చేశారు.






