- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంచల్‌గూడ జైల్లో ఉగ్రకుట్ర : క్లారిటీ ఇచ్చిన జైళ్లశాఖ డీజీ సౌమ్య
హైదరాబాద్ లో పేలుళ్లకు చంచల్ గూడ జైల్లో ఉగ్రకుట్ర జరిగినట్లు వస్తున్న వార్తలపై జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: చంచల్ గూడ జైల్లో ఇటీవల నిర్వహించిన ములాఖత్ లో పేలుళ్లకు ప్లాన్ రచించినట్లుగా నిఘావర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు వస్తున్న వార్తలను జైళ్లశాఖ డీజీ సౌమ్య మిశ్రా ఖండించారు. ఉగ్రకుట్రకు ప్లాన్ చేస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజంలేదని, అదంతా అవాస్తవమని స్పష్టం చేశారు. ఈ అసత్య వార్తలను కొన్ని మీడియా ఛానళ్లు, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో స్ప్రెడ్ చేస్తున్నారని, ప్రజలను ఇలాంటి వార్తలతో భయాందోళనలకు గురిచేయవద్దని కోరారు.
లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన ఉగ్రవాది జైల్లో ప్రణాళికలు రచించినట్లుగా నిఘావర్గాలు ఆరోపిస్తున్నాయని నిన్నటి నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. ముసారాంబాగ్, సైదాబాద్, మలక్ పేటలో పోలీసులు నిఘా పెంచారని, అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తుల్ని ప్రశ్నిస్తున్నారని వాటి సారాంశం. అయితే ఈ వార్తలతో హైదరాబాద్ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వైరల్ అవుతున్న వార్తలపై జైళ్ళశాఖ డీజీ సౌమ్య మిశ్రా స్పష్టతనిచ్చారు.






