- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరి కొద్ది నెలల్లో అందుబాటులోకి యాదాద్రి పవర్ ప్లాంట్.. సీఎండీలతో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సమీక్ష
వచ్చే వేసవిలో రికార్డు స్థాయిలో నమోదయ్యే విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్ సంస్థలు సంసిద్ధంగా ఉండాలని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ విద్యుత్ సంస్థల యాజమాన్యాలను ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే వేసవిలో రికార్డు స్థాయిలో నమోదయ్యే విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్ సంస్థలు సంసిద్ధంగా ఉండాలని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ (Naveen Mittal) విద్యుత్ సంస్థల యాజమాన్యాలను ఆదేశించారు. శనివారం (TGSPDCL) టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో టీజీ ట్రాన్స్ కో చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ భాస్కర్, జెన్ కో చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ హరీశ్, సింగరేణి సీఎండి ఎన్ బలరాం, డిస్కంల సీఎండీలు ముషారఫ్ ఫరూఖీ, వరుణ్ రెడ్డి, మరియు రెడ్ కో సీఎండీ అనిలతో పాటు విద్యుత్ సంస్థల డైరెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లతో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలు సమీక్షించారు.
ఈ ఏడాది గరిష్ట డిమాండ్ 17162 మెగావాట్లకు చేరినా, ప్రభుత్వ ఆదేశాలతో విద్యుత్ సంస్థలు ముందస్తుగా తీసుకున్న చర్యల వలన విద్యుత్ సరఫరాలో ఎక్కడా ఓవర్ లోడింగ్ సమస్యలు తలెత్తలేదని తెలిపారు. ఇదే తరహాలో వచ్చే ఏడాది ఎండాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట డిమాండ్ 19 వేల మెగావాట్లకు మించే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో రబి ప్రారంభానికి ముందే, తలపెట్టిన లైన్ల మరమ్మతులు, కొత్త ట్రాన్స్ ఫార్మర్‌ల ఏర్పాటుతో పాటు, ఇతర అభివృద్ధి పనులన్ని డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనీ చీఫ్ ఇంజినీర్లకు, సూపరింటెండింగ్ ఇంజినీర్లకు దిశా నిర్దేశం చేశారు.
త్వరలో అందుబాటులోకి యాదాద్రి థర్మల్ అన్ని యూనిట్లు
తెలంగాణ జెన్ కో పరిధిలోని విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఓవర్ హాలింగ్ దాదాపు అన్ని యూనిట్లలో పూర్తయ్యిందని, బీటీపీఎస్, కేటీపీఎస్ 4 ప్లాంట్ల ఓవర్ హాలింగ్ త్వరలో పూర్తి చేయనున్నారు. మరి కొద్ది నెలల్లో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని అన్ని యూనిట్లు అందుబాటులోకి వస్తాయని, దీని వలన ఈ ప్లాంట్ నుంచి మొత్తం 4000 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని క్లారిటీ ఇచ్చారు. థర్మల్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గు అందుబాటులో ఉండేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి సీఎండీ బలరాం మాట్లాడుతూ.. ప్రస్తుతం 1.80 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నామని, నవంబర్ నాటికి ప్రతి రోజు 2.20 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయనున్నట్లు, వేసవి నాటికి, రాష్ట్ర జెన్ కో పరిధిలోని బొగ్గు ఆధారిత ప్లాంట్లకు బొగ్గు సరఫరాలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా తగు చర్యలు చేపడుతున్నామన్నారు.
చార్జింగ్ స్టేషన్ల రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి
పీఎం - ఈ డ్రైవ్ లో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ లకు ఇస్తున్న రాయితీలు ప్రభుత్వ సంస్థలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని మిట్టల్ పేర్కొన్నారు. హైదరాబాద్ ను ఈ వీ హబ్ గా మార్చడంలో విద్యుత్ సంస్థలు, రెడ్ కో సంయుక్తంగా ముందుకు వెళ్లాలన్నారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో పీఎం ఈ డ్రైవ్ లో భాగంగా చేస్తున్న సర్వేలో అక్టోబర్ 25 నాటికి 3121 ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ల ఏర్పాటుకు స్థలాలు గుర్తించినట్లు డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు.






