- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ శ్రేణుల్లో ఫుల్ జోష్.. మే 9న తెలంగాణకు ప్రధాని మోడీ
మే 9న తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. మూడో సారి ప్రధాని అయ్యాక తొలిసారి రాష్ట్రానికి రాబోతున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తిగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర తెలంగాణ పర్యటన ఖరారైంది. మే 9న ఆయన రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్‍లో భారీ బహిరంగ సభ నిర్వహణకు తెలంగాణ బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే మూడోసారి ప్రధాని అయ్యాక మోడీ తెలంగాణలో పర్యటించడం ఇదే తొలిసారి కావడంతో ఈ టూర్‍ను తెలంగాణ బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. గత కొంత కాలంగా అంతర్గత సమస్యలతో సతమతం అవుతున్న టీ బీజేపీకి మోడీ టూర్ కాషాయ శిబిరంలో కొత్త జోష్ నింపే సూచనలు కనిపిస్తున్నాయి.
సెట్ రైట్ అయ్యేనా?:
ప్రస్తుతం తెలంగాణ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ప్రధాన పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లు ఎత్తుకు పై ఎత్తుల పర్వం కొనసాగుతోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ బహిరంగ సభలతో ఇరు పార్టీల మధ్య పొలిటికల్ వార్ రంజుగా సాగింది. ఈ క్రమంలో తెలంగాణ గడ్డపై ఎంట్రీ ఇవ్వబోతున్న మోడీ ఎలాంటి వ్యూహరచనతో రాబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు ఇటీవల మహిళా బిల్లు, డీలిమిటేషన్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యటనలో మోడీ ఎలా ఎటాక్ చేస్తారనేది తెలియాల్సి ఉంది. ఇక గత కొంత కాలంగా తెలంగాణ బీజేపీ నేతల మధ్య ఆధిపత్య పోరు చర్చగా మారింది. ఈ అంశంలో గతంలోనే మోడీ హెచ్చరించినా నేతలు తమ తీరు మార్చుకోలేదనే అసంతృప్తి సొంత పార్టీలోనే వినిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో మోడీ పర్యటన తెలంగాణ బీజేపీకి ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది.






