మరోసారి తెలంగాణకు మోడీ.. ప్రధాని పూర్తి షెడ్యూల్ ఇదే..!

by Disha Web Desk 19 |
మరోసారి తెలంగాణకు మోడీ.. ప్రధాని పూర్తి షెడ్యూల్ ఇదే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో ఆయన ప్రచారంలో పాల్గొననున్నారు. ఈనెల 25న మహేశ్వరం, కామారెడ్డి సభల్లో ఆయన పాల్గొంటారు. 26న తుఫ్రాన్, నిర్మల్ సభలకు ప్రధాని హాజరవుతారు. 27న మహబూబ్‌బాద్, కరీంనగర్ సభల్లో పాల్గొననున్నారు. అనంతరం అదేరోజు సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించే రోడ్ షోకు హాజరవుతారు. కాగా రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయాల్సి ఉంది.

రేపు రాష్ట్రానికి హిమంత, ఇతర జాతీయ నేతలు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ బుధవారం తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు. చార్మినార్, మలక్ పేట సెగ్మెంట్లలో ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తారు. కాగా మరికొందరు జాతీయ నేతలు సైతం ప్రచారంలో పాల్గొననున్నారు. బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు, బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య సైతం ప్రచారంలో పాల్గొంటారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎంపీ రవి కిషన్ పటాన్ చెరువు, కుత్బుల్లాపూర్, రాజేంద్ర నగర్‌లో ప్రచారం నిర్వహించనున్నారు. మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ సైతం ప్రచారం నిర్వహించనున్నారు. ఇకపోతే కేంద్ర మంత్రి అర్జున్ ముండా వర్ధన్నపేట, స్టేషన్ ఘనపూర్‌లో బుధవారం, గురువారం వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేపడుతారు.

Next Story

Most Viewed