- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి.. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
దాయాది పాక్‌తో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: దాయాది పాక్‌తో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్ (Hyderbad)లోని ట్యాంక్‌బండ్ వేదికగా నిర్వహించాన తిరంగా ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరిహద్దులో సైనికుల వీరోచిత పోరాటమే దేశం సురక్షితంగా ఉందన్నారు. భారత్ ఏనాడు తనకు తానుగా ఏ దేశంపైనా యుద్ధానికి కాలు దువ్విన సందర్భాలు లేవని అన్నారు. ఉగ్రమూకలను అంతం చేసేందుకు, దేశాన్ని కాపాడుకునేందుకే పాకిస్థాన్ (Pakistan)తో పాటు పీవోకేపై దాడి చేయాల్సి వచ్చిందన్నారు. దేశ ప్రజలంతా ఇండియన్ ఆర్మీ (Indian Army)కి సెల్యూట్ కొట్టాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.
హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డా..
హైదరాబాద్ నగరం ఉగ్రవాదులకు అడ్డగా మారిందని మహారష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు (Vidyasagar Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తిరంగా ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కొన్ని రాజకీయ శక్తులు ఉగ్ర మూకలకు ఆశ్రయమిస్తూ ఆర్థికంగా సహకరిస్తున్నాయని ఆరోపించారు. నగరంలో పెట్రేగిపోతున్న ఉగ్రవాదులను ఏరివేయాలని విద్యాసాగర్ రావు కామెంట్ చేశారు.






