ప్రెసిడెంట్ పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. 25కి పైగా ఒప్పందాలు చేసుకునే చాన్స్!

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-05 07:09:52  IST  )

భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

ప్రెసిడెంట్ పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. 25కి పైగా ఒప్పందాలు చేసుకునే చాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)తో భేటీ అయ్యారు. ఈ మేరకు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌ హౌస్‌ (Hyderabad House)లో ఇరు దేశాల 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో ప్రధానంగా రక్షణ, ఇంధన వాణిజ్యం, వాణిజ్య అసమతుల్యత తగ్గించడం, యురేషియన్ ఆర్థిక సమాఖ్యతో ఉచిత వాణిజ్య ఒప్పందం వంటి అంశాలపై లోతుగా చర్చించనున్నారు. బ్రహ్మోస్ క్షిపణి తయారీ, రష్యా సూపర్ జెట్ సు-57 సహకారం, చిన్న మాడ్యులర్ అణు రియాక్టర్లు వంటి 25కి పైగా ఒప్పందాలు ఇరు దేశాలు చేసుకోనున్నాయని తెలుస్తోంది. అయితే, ఇరు దేశాల మైత్రికి ఢిల్లీలో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిర్మించిన ‘హైదరాబాద్ హౌస్’ వేదిక కావడం విశేషం.

Next Story