- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Priest Rangarajan: వారసత్వ అర్చకత్వాన్ని వెంటనే పునరుద్ధరించాలి: ప్రభుత్వానికి సీఎస్ రంగరాజన్ వినతి
by Kema Shiva Kumar |
రాష్ట్ర వ్యాప్తంగా వారసత్వ అర్చకత్వాన్ని వెంటనే పునరుద్ధరించాలని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ ప్రభుత్వాన్ని కోరారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా వారసత్వ అర్చకత్వాన్ని వెంటనే పునరుద్ధరించాలని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం ఆయన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిసివ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్ఛకులకు ఇతర రంగాల్లో అవకాశాలు తక్కువ అని, పూర్వం నుంచి అర్చకత్వాన్నే నమ్ముకున్నారని, అందుకే వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలన కోరారు. అదేవిధంగా పురాత ఆలయాలు అయిన భద్రాద్రి, వేములవాడ, బాసర ఆలయాల్లో వారసత్వ అర్చకుల సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయంటూ సర్కార్ దృష్టికి తీసుకెళ్లారు. 1996లో వారసత్వ అర్చకత్వానికి సంబంధించి ఎంవీ సౌందర రాజన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించిందంటూ డిప్యూటీ సీఎంకు రంగరాజన్ విన్నవించారు.
Next Story






