- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bhatti Vikramarka : గతంలో 169 రోజులు.. ఇపుడు కేవలం 9 రోజులే : భట్టి విక్రమార్క
రైతు సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మరోసారి స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : రైతు సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) మరోసారి స్పష్టం చేశారు. కేవలం 9 రోజుల్లోనే రూ.8,744.13 కోట్ల రైతు భరోసా(Raithu Bharosa) నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా, మేము రైతుల పట్ల మా నిబద్ధతను మరోసారి నిరూపించామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఒకే సీజన్ నిధుల కోసం 169 రోజులు పట్టిన సందర్భం ఉన్నా, ఇప్పుడు కేవలం 9 రోజుల్లోనే పూర్తి చేయడం చరిత్రలో నిలిచిపోయే ఘనత అని, అది కేవలం కాంగ్రెస్ వల్లె సాధ్యం అవుతుందని అన్నారు.
ఇది మాటల ప్రభుత్వం కాదని, బాధ్యత కలిగి ఉన్న ప్రజాప్రభుత్వం అని, రైతుకు అండగా నిలిచే ఇందిరమ్మ ప్రభుత్వం అని వెల్లడించారు. ఈ మేరకు భట్టి విక్రమార్క తన X ఖాతా వేదికగా ఓ పోస్ట్ చేశారు. అందులో గత ప్రభుత్వంలో నిధుల విడుదలకు ఎంతకాలం పట్టింది, ప్రస్తుతం ఎంత కాలం పట్టింది అనే వివరాలు ఉన్నాయి.






