- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్థానిక ఎన్నికలకు సన్నద్ధం.. పంచాయతీరాజ్ శాఖ కీలక ఆదేశాలు
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతున్నది. అందులో భాగంగానే పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ సృజన బుధవారం జిల్లా పంచాయతీ, జిల్లా పరిషత్ సీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతున్నది. అందులో భాగంగానే పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ సృజన బుధవారం జిల్లా పంచాయతీ, జిల్లా పరిషత్ సీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ చివరి నాటికి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని, వాటిని అమలు చేసే విధంగా రెడీగా ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేయాలని సూచించారు. ఇప్పటికే సరఫరా చేసిన సామగ్రిని సరిచూసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో 31 జెడ్పీ చైర్మన్‌లు, 566 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ఉన్నాయని, 5,773 ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేసినట్టు వివరించారు. మరోవైపు రాష్ట్రంలో 12,778 గ్రామ పంచాయతీలు ఉండగా, వీటిల్లో 1.12 లక్షల వార్డులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. వీటి ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ స్పష్టం చేశారు.
ఒకటి, రెండు రోజుల్లో సమావేశం
స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ పేపర్ విధానంలో జరగనున్నాయి. ఇప్పటికే బ్యాలెట్‌బాక్సులను జిల్లాల్లో అందుబాటులో ఉంచారు. సర్పంచ్, వార్డు సభ్యుల కు అవసరమైన బ్యాలెట్పేపర్స్ముద్రించారు. వాటిని జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. స్టేషనరీ, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సామగ్రిని రాష్ట్ర స్థాయిలో కొనుగోలు చేసి జిల్లాలకు ఇప్పటికే తరలించారు. వాటిని మరోసారి సరిచూసుకోవాలని సృజన సూచించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ సిబ్బంది, పోలీసుల వివరాలను మరో సారి చెక్ చేసుకోవాలని తెలిపారు. మరోవైపు వర్షకాలం కావడంతో ప్రత్యేక ఏర్పాట్లు అవసరం అవుతాయని అధికారులు గుర్తించారు. ఒకటి రెండు రోజుల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లు, డీపీవో, జిల్లా పరిషత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ
మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల ఖరారుకు అవసరమైన ఏర్పాట్లపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పంచాయతీరాజ్చట్టం 2018కి సవరణ చేసిన సర్కారు.. దానిని గవర్నర్‌కు పంపింది. ఎలాగైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పట్టుదలతో ఉన్నది. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్‌పై గవర్నర్ సంతకం చేయగానే రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ జారీ అవుతాయి.






