- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చలికాలం జాగ్రత్తలు పాటించాలి : వైద్య, ఆరోగ్య శాఖ అడ్వైజరీ
రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సీజనల్ ఫ్లూ, శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ హెచ్చరిస్తూ ఓ అడ్వైజరీ విడుదల చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సీజనల్ ఫ్లూ, శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ హెచ్చరిస్తూ ఓ అడ్వైజరీ విడుదల చేసింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం రానున్న వారం రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 2-3 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
ఈ పరిస్థితుల్లో జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శరీర నొప్పులు, అలసట వంటి లక్షణాలు కనబడితే జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. సీజనల్ ఫ్లూ సాధారణంగా వారం రోజుల్లో తగ్గిపోతుందన్నా... గర్భిణులు, ఐదేళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు వైద్యుడిని వెంటనే సంప్రదించాలంటూ సూచించింది.
అప్రమత్తంగా ఉండాల్సిన లక్షణాలు:
అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మం లేదా పెదవులు నీలి రంగులోకి మారడం, రక్తం కలిసిన కఫం రావడం, ప్రవర్తనలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తే సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటనే చికిత్స పొందాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డా. బి. రవీందర్ నాయక్ సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు.
జాగ్రత్తలు:
దగ్గు, తుమ్ము సమయంలో రుమాలు లేదా టిష్యూపేపర్‌తో నోరు, ముక్కు మూసుకోవాలి. తరచుగా చేతులు సబ్బుతో కడుక్కోవాలి. జ్వరం, దగ్గు, తుమ్ము ఉన్నవారు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కువగా నీరు తాగి, పోషకాహారం తీసుకోవాలి. గదుల్లో తగినంత గాలి ప్రసరణ ఉండేలా చూడాలి. పబ్లిక్ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. డాక్టర్ సలహా లేకుండా మందులు తీసుకోకూడదని... ప్రజారోగ్య శాఖ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక పడకలు, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచిందని డా. రవీందర్ నాయక్ తెలిపారు.






