తెలంగాణలో వర్షాలు, వరదలపై ముందస్తు చర్యలు

by Gantepaka Srikanth |

తెలంగాణలో భారీ వర్షాలు(Rains), వరదలపై(Floods) ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. ప్రతీ జిల్లాకు రూ.కోటి చొప్పున నిధులు కేటాయించిన విషయం తెలిసిందే.

తెలంగాణలో వర్షాలు, వరదలపై ముందస్తు చర్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో భారీ వర్షాలు(Rains), వరదలపై(Floods) ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. ప్రతీ జిల్లాకు రూ.కోటి చొప్పున నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ నిధులను విడుదల చేసింది. రాష్ట్రంలోని 33 జిల్లాలకు.. జిల్లాకు ఒక కోటి చొప్పున.. రూ.33 కోట్లు రిలీజ్ చేసింది. ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించేందుకే ఈ తక్షణ చర్యలు అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు.. విపత్కర సమయాల్లో వాడుకునేందుకు కలెక్టర్లకు అత్యవసర నిధిని కేటాయిస్తామని తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అప్రమత్తం చేశారు. అన్ని జిల్లా కలెక్టర్లు, వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసేలా దిశానిర్దేశం చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలి. నీటి ఉద్ధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రజలకు సాయం చేసేందుకు అధికారులు జిల్లాల్లోనే అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు.

Next Story