TG: పీఆర్‌సీ గడువు మళ్లీ పొడిగింపు

by Prasad Jukanti |   (  Updated:2026-03-26 12:22:33  IST  )

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది.

TG: పీఆర్‌సీ గడువు మళ్లీ పొడిగింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి నిరాశే మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ కమిషన్ గడువును (Telangana PRC Extension) ప్రభుత్వం పెంచింది. పీఆర్‍సీ గడువు సెప్టెంబర్ నెలాఖరు వరకు పొడిగించింది. ప్రస్తుత పీఆర్‌సీ కమిటీ గడువు మరో ఐదు రోజుల్లో (31 మార్చి)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలల పాటు కమిటీ గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కొత్త పీఆర్‌సీ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కానీ కొత్త పీఆర్‌సీ నివేదిక ఇంకా ప్రభుత్వానికి చేరలేదు. ఈ తరుణంలో కొత్త పీఆర్‌సీ కోసం ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించారు.

రెండు రోజుల క్రితం అసెంబ్లీలో:

ప్రస్తుతం బడ్జెట్ సమావేశాల సందర్భంగా విపక్షాలు సైతం ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోగా కొత్త పీఆర్సీ ఇస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారని కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కావొస్తున్నా పీఆర్సీ ఇవ్వలేదు. మళ్లీ ఎక్స్‌టెన్షన్ ఇస్తారా? కనీసం ఇప్పుడైనా రిపోర్ట్ తీసుకుని ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ఎప్పటిలోగా ఇస్తారో స్పష్టంగా చెప్పాలని రెండు రోజుల క్రితం శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే ప్రభుత్వం మాత్రం మరోసారి పీఆర్సీ కమిటీ పొడిగింపుకే మొగ్గు చూపింది.

ఎంఎంటీఎస్‌పై సీఎం రేవంత్ సమీక్ష.. ఎంఎంటీఎస్ స్టేషన్ల వద్దకు మినీ బస్సులు!

Next Story