ప్రవళిక సూసైడ్.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ట్వీట్!

by Sathputhe Rajesh |   (  Updated:2023-10-14 13:00:04  IST  )

నిన్న హైదరాబాద్‌లో నిరుద్యోగ యువతీ ప్రవళిక ఆత్మహత్యపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.

ప్రవళిక సూసైడ్.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ట్వీట్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : నిన్న హైదరాబాద్‌లో నిరుద్యోగ యువతీ ప్రవళిక ఆత్మహత్యపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. " ప్రవళిక ఆత్మహత్య అత్యంత బాధాకరం. ఇది ఆత్మహత్యగా మాత్రమే చూడవద్దు.. నిరుద్యోగ యువత కలలు ఆశలను ప్రభుత్వం హత్య చేసినట్టు ఉంది. త్వరలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. నిరుద్యోగ యువత ఆశలను నిలబెడుతుంది. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ కూడా నిర్వహిస్తాం. ఒక్క ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఇది మా గ్యారెంటీ.."అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కాగా శుక్రవారం రాత్రి హైదరాబాద్ అశోక్‌నగర్‌లో ప్రవళిక అనే గ్రూప్ -2 అభ్యర్థిని హాస్టల్‌లో ఉరి వేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే.

Next Story