ప్రశాంత్ కిషోర్ ఓ రాజకీయ దొంగ.. సామ రామ్మోహన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

by Kema Shiva Kumar |

బిహార్ (Bihar) ప్రజల వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి హేళనగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తమ గడ్డపై అడుగు‌పెడితే తరిమికొడతామని రాజకీయ వ్యూహకర్త, జన సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishore) మాస్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ప్రశాంత్ కిషోర్ ఓ రాజకీయ దొంగ.. సామ రామ్మోహన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ (Bihar) ప్రజల వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి హేళనగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తమ గడ్డపై అడుగు‌పెడితే తరిమికొడతామని రాజకీయ వ్యూహకర్త, జన సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishore) మాస్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ (Telangana)కు పనిగట్టుకుని మరీ వెళ్లి రేవంత్‌ను ఓడిస్తానని ఆయన ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఫైర్ అయ్యారు.

ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి (Sama Rammohan Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఇవాళ ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రశాంత్ కిషోర్ ఓ రాజకీయ దొంగ అని ఆరోపించారు. అతడు ఓ ప్రీపెయిడ్ రీఛార్జ్ లాంటి వాడని.. ఎంత రీఛార్జ్ చేస్తే అంత టాక్‌టైమ్ వచ్చినట్లుగా మాట్లాడుతుంటాడని ఫైర్ అయ్యారు. రాజకీయ పార్టీలకు సలహాలు ఇచ్చే ప్రశాంత్ కిషోర్ బిహార్ ప్రజల ప్రయోజనాల కోసం ఎప్పుడైనా కనీసం 15 నిమిషాలైన మాట్లాడారా.. అని ప్రశ్నించారు. ఎలాంటి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని.. ప్రస్తుతం ప్రపంచమంతా ఆయననే చూసేలా పని చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రశాంత్ కిషోర్ ఆచితూచి మాట్లాడితే.. బాగుంటుందని సామ రామ్మోహన్ రెడ్డి హితవు పలికారు.

Next Story