Graduate Election: కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ లో అనూహ్య పరిణామం.. ప్రసన్న హరికృష్ణ ఎలిమినేట్

by Prasad Jukanti |

ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ నుంచి ప్రసన్న హరికృష్ణ ఎలిమినేట్ అయ్యారు.

Graduate Election: కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ లో అనూహ్య పరిణామం.. ప్రసన్న హరికృష్ణ ఎలిమినేట్
X

దిశ బ్యూరో, కరీంనగర్/డైనమిక్ బ్యూరో: కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ (Graduate MLC) ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ వీడటం లేదు. మొదటి ప్రయార్టీ ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలకపోవడంతో సెకండ్ ప్రయార్టీ ఓట్ల లెక్కింపు చేపట్టారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి మధ్య పోటీ రౌండ్ రౌండ్‌కు టెన్షన్ పెట్టిస్తున్నది. అయితే రెండో ప్రయార్టీ ఓట్ల లెక్కింపులోనూ ఈ ఇద్దరిలో గెలుపు కోసం నిర్ధారించిన 1,11,672 ఓట్ల సంఖ్యను అభ్యర్థులు చేరుకోలేకపోయారు. దీంతో మొత్తం పోటీ చేసిన 56 మంది అభ్యర్థుల్లో సాయంత్రం 4గంటల వరకు 52 మందిని ఎలిమినేట్ చేయగా తాజాగా బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ (Prasanna Harikrishna), మరో అభ్యర్థి యాదగిరి శేఖర్‌రావును కూడా ఎలిమినేట్ చేశారు. దీంతో అంజిరెడ్డి(Anji Reddy), నరేందర్‌రెడ్డి (Narender Reddy) మినహా మిగతావారంతా ఎలిమినేట్ అయ్యారు. వారి ఓట్లను అంజిరెడ్డికి, నరేందర్‌రెడ్డికి బదలాయించనున్నారు. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా వాటికి సంబంధించిన వివరాల సమాచారం అధికారులు ఇంకా బయటకు వెల్లడించలేదు.

గెలుపును నిర్ధారించనున్న ప్రసన్న హరికృష్ణ ఓట్లు!

కౌంటింగ్ రేస్‌లో ప్రసన్న హరికృష్ణను తప్పించడంతో ఆయనకు పోలైన 60,419 ఓట్లు అంజిరెడ్డి, నరేందర్‌రెడ్డి గెలుపులో కీలకం కానున్నట్లు తెలుస్తోంది. ప్రసన్న హరికృష్ణకు పోలైన ఓట్లలో ఎవరికి ఎక్కువ సెకండ్ ప్రయార్టీ ఓట్లు (Second priority votes) వచ్చాయో వారి గెలుపు సునాయాసం కానున్నట్లు తెలుస్తోంది. మరో గంటలో ఫలితం తేలనున్నట్లు సమాచారం.

Next Story