Phone Tapping Case: ముగిసిన ప్రణీత్ రావు విచారణ..సిట్ ముందు కీలక విషయాలు వెల్లడి!

by Prasad Jukanti |

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతం అయింది.

Phone Tapping Case: ముగిసిన ప్రణీత్ రావు విచారణ..సిట్ ముందు కీలక విషయాలు వెల్లడి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు (Praneeth Rao) విచారణ ముగిసింది. ఈ నెల 13, 18 తేదీలలో ప్రణీత్ రావును విచారించిన సిట్ అధికారులు ఇవాళ మరోసారి ప్రశ్నించారు. ఈ కేసులో బాధితుల వాంగ్మూలాల ఆధారంగా మరోసారి ప్రణీత్ రావును విచారించినట్లు తెలుస్తోంది. ఎవరి ఆదేశాల మేరకు ఫోన్లు ట్యాప్ చేశారు? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరిది ప్రధాన పాత్ర అనే కోణంలో సిట్ దర్యాప్తు చేసింది. అయితే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) ఆదేశాలనే తాను అమలు చేశానని ఆయన ఆదేశాలతోనే హార్డ్ డిస్క్ లు ధ్వంసం చేసినట్లు ప్రణీత్ రావు గతంలోనే సిట్ ముందు అంగీకరించారు. ఈ కేసులో ఏ2గా ఉన్న ప్రణీత్ రావును పోలీసులు గతంలోనే అరెస్టు చేసి కస్టడీకి తీసుకుని విచారించారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉండగా ప్రభాకర్ రావు, సాక్షుల వాంగ్మూలాల నేపథ్యంలో మరోసారి వరుసగా ఆయనను విచారణకు పిలిచి ప్రశ్నించడం ఆసక్తిగా మారింది. ఈ దఫాలో ప్రణీత్ రావు వెల్లడించిన అంశాలు దర్యాప్తులో కీలకంగా మారబోతున్నట్లు తెలుస్తోంది.

Next Story