- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్విట్టర్‌లో నటుడు ప్రకాష్ రాజ్ వర్సెస్ బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి
టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్, బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి మధ్య ట్విట్స్ వార్ నడుస్తోంది. ఓ మీడియా సమావేశంలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్, బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి మధ్య ట్విట్స్ వార్ నడుస్తోంది. ఓ మీడియా సమావేశంలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. కేంద్రం మావోయిస్టును హతమార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం పాపం చేశారని అలా చంపేస్తున్నారని ప్రశ్నించారు. వాళ్లు కూడా ప్రజలే కదా.. జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని అడగాలి కానీ చంపడం ఏంటి అని ప్రశ్నించారు. కాగా ఆ వీడియోను విష్ణువర్థన్ రెడ్డి షేర్ చేస్తూ ప్రకాష్ రాజ్ కు కౌంటర్ ఇచ్చారు.
మావోయిస్టులు ఎంతో మంది అమాయకులను చంపారన్నారు. అందులో ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారని పోలీసులు, రాజకీయ నేతలు కూడా ఉన్నారని అన్నారు. ఏ కారణంతో చంపినా అసలు చంపే హక్కు ఉందని ఎప్పుడైనా మీరు ప్రశ్నించారా? అని అడిగారు. నేడు జనజీవనంలోకి వచ్చిన మావోయిస్టు నేతలే అడవిలో అడవిలో ఉన్న తోటివారి తుపాకులు హింసను ఆపమంటున్నారని పేర్కొన్నారు. ఇక తాజాగా విష్ణువర్ధర్ రెడ్డి ట్వీట్ పై ప్రకాష్ రాజ్ స్పందించారు. వెంటనే రియాక్ట్ అయ్యారు కాలిందా? జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్ చేశారు. దీంతో విష్ణువర్ధన్ రాజు ఎలాంటి రిప్లై ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.






