- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: తెలంగాణలో ఆ పార్టీదే గెలుపు: ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం ఓ తెలుగు చానెల్ డిబేట్‌లో ఆయన మాట్లాడుతూ..

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం ఓ తెలుగు టీవీ చానెల్ డిబేట్‌లో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ విజన్ తనకు నచ్చుతుందని.. ఆయన గొప్ప మానవతావాది అని కొనియాడారు. కేసీఆర్ ఆలోచనలు, విధానాల్లో నటన లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ విజన్ నచ్చడం, ఆయనకు దగ్గర ఉన్నంత మాత్రాన నేను బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.
తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ప్రకాష్ రాజ్ జోస్యం చెప్పారు. పదేళ్లు వరుసగా అధికారంలో ఉండటంతో ప్రజలు ఇంకొకరిని చూద్దామా అనుకోవడం సహజమని.. కానీ కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం ఎవరూ అనేది కూడా ముఖ్యమేనని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఉన్నట్లు బీఆర్ఎస్ ఇప్పుడు లేదని.. కేసీఆర్ మాటల్లో పస తగ్గింది అనుకోవడం సహజమేనని అన్నారు.
తెలంగాణ ఉద్యమం న్యాయం కోసం జరిగిందని.. అలాగే తెలంగాణ వచ్చాక జరిగింది ఏంటనేది చూడాలన్నారు. కుటుంబ పాలన కాదు.. వారికి అర్హత ఉందా లేదా అనేది చూడాలన్నారు. ఇక, బీజేపీపై మరోసారి తన అభిప్రాయన్ని వ్యక్తం చేశారు. నా ఐడీయాలజీకి బీజేపీ నేతలు దూరంగా ఉంటారని.. సమాజంలో భిన్నాభిప్రాయాలు ఉండాలని అన్నారు. దేశంలో అంతా తమ వల్లే అనే భావన నుండి బీజేపీ నాయకులు బయటకు రావాలని సూచించారు. అయోధ్య రామమందిరంపై బీజేపీ రాజకీయం చేయడం సరికాదన్నారు.






