- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుప్రీంకోర్టుపై స్పీకర్‌కి గౌరవం లేదా ? ప్రజాశాంతి పార్టీ చీఫ్ కే ఏ పాల్ ఫైర్
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ రాజీనామా చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ డిమాండ్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ రాజీనామా చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా పార్టీ ఫిరాయించలేదని స్పీకర్ నిర్ణయించడం షాక్ కి గురి చేసిందన్నారు. స్పీకర్ కి కళ్ళు కనిపించడం లేదా? అని సెటైర్లు వేశారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మొదట హైకోర్టులో పిటిషన్ వేసింది తనే అని అన్నారు. దానం నాగేందర్ కూడా పార్టీ ఫియంరాయించలేదని చెబుతారా ? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు పై స్పీకర్ కి గౌరవం లేదా ? అని ఫైర్ అయ్యారు.
బహిరంగంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారని ఆరోపించారు. స్పీకర్‌కు చట్టం తెలుసా.. స్పీకర్ నిర్ణయం సిగ్గు చేటు అని విమర్శించారు. 2015 లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం అయ్యారన్నారు. ఓటుకు నోటు కేసులో ఉన్నవారు ఇప్పుడు ముఖ్యమంత్రులుగా ఉన్నారని అన్నారు. 10 ఏళ్లుగా విచారణ కొనసాగుతుందని, ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గు చేటన్నారు. పార్టీ ఫిరాయింపులపై తన పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు.






