- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: ప్రారంభమైన ప్రజా దర్బార్.. భారీగా తరలివచ్చిన జనం (వీడియో)
హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్‌లో సోమవారం ప్రజా దర్బార్ ప్రారంభమైంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్‌లో సోమవారం ప్రజా దర్బార్ ప్రారంభమైంది. తమ సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు ప్రజలు బారులు తీరారు. ఇవాళ ముఖ్యమంత్రి అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది. అయితే మంత్రులు, అధికారులు ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు సమాచారం. వినతి పత్రాలు సమర్పించేందుకు వివిధ ప్రాంతాల నుంచి జనాలు వస్తున్న నేపథ్యంలో ప్రజా భవన్‌లో ప్రజలకు ఎండ నుంచి ఉపశమనం కోసం టెంట్లు, వికలాంగుల కోసం ట్రై సైకిల్స్, మంచినీటి సౌకర్యం కల్పించారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో ప్రజాదర్బార్‌ను ప్రభుత్వం మరింత పటిష్టంగా నిర్వహించాలని భావిస్తోంది.
Next Story






