- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాసేపట్లో నాంపల్లి కోర్టుకు ప్రభాకర్ రావు.. అసలు విషయం ఇదే!
ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) ఇవాళ కాసేపట్లో నాంపల్లి కోర్టు (Nampally Court)కు హాజరు కాబోతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) ఇవాళ కాసేపట్లో నాంపల్లి కోర్టు (Nampally Court)కు హాజరు కాబోతున్నారు. అయితే, కేసులో విచారణకు హాజరుకాకుండా అమెరికాలో తలదాచుకున్న సమయంలో ఆయనపై నాంపల్లి కోర్టు ప్రోక్లైమ్ అఫెండర్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులలో CRPC సెక్షన్ 82-1860 ప్రకారం తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి.. విచారణకు హాజరుకాని పక్షంలో ఆ విషయంపై కోర్టు విచారణ జరిపి నిందితుడిని ప్రకటిత నేరస్థుడిగా గుర్తిస్తామని పేర్కొంది. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో ఈనెల 20లోపు న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని నోటీసులలో పేర్కొంది. నోటీసులు అందుకున్న ఆయన జూన్ 10న నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కానీ, జడ్జి అందుబాటులో లేకపోవడం తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మరోసారి ప్రభాకర్ రావు నాంపల్లి కోర్టులో జడ్జి ఎదుట హాజరు కాబోతున్నారు.






