Phone Tapping: మూడోసారి విచారణకు ప్రభాకర్ రావు.. నేడు సిట్ వేసే ప్రశ్నలు కీలకం! ఎందుకంటే?

by Ramesh Naini |

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది.

Phone Tapping: మూడోసారి విచారణకు ప్రభాకర్ రావు.. నేడు సిట్ వేసే ప్రశ్నలు కీలకం! ఎందుకంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసు వ్యవహారంలో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) మూడోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. శనివారం జూబ్లీహిల్స్ పీఎస్‌లోని సిట్ కార్యాలయంలో విచారణ జరుగుతోంది. ఇక సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేస్తారనే దానిపై ఉత్కంఠ రేపుతోంది. నిన్న మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు పై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే హార్డ్ డిస్క్ ధ్వంసం చేశామని ప్రణీత్ రావు అధికారులకు చెప్పినట్లు సమాచారం. (Praneeth Rao) ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావు విచారణ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభాకర్ రావు విచారణ నేడు కీలకంగా మారనున్నది.

కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ప్రభాకర్ రావు ఉన్నారు. ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్‌తో తర్వాత ఆయన ఆమెరికా వెళ్లారు. దాదాపు 15 నెలల తర్వాత సుప్రీంకోర్డులో అరెస్ట్‌పై ఊరట లభించడంతో ఇటీవల హైదరాబాద్‌కు వచ్చారు. వచ్చిన తర్వాత రోజు నుంచే సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొందరు ప్రజాప్రతినిధులతో పాటు వారి అనుచరులు దాదాపు 200 మంది ఫోన్‌లు ట్యాప్ చేశారని సిట్ అధికారులు గుర్తించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతల ఫోన్‌లు ట్యాప్ చేసినట్లు సిట్ తేల్చింది.

Next Story