BC కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్

by Gantepaka Srikanth |

బీసీ కులగణనపై సందీప్ కుమార్ సుల్తానియా, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిషెట్టి కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విరవించనున్నారని సబ్ కమిటీ చైర్మెన్, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

BC కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ కులగణనపై సందీప్ కుమార్ సుల్తానియా, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిషెట్టి కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విరవించనున్నారని సబ్ కమిటీ చైర్మెన్, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్-1లో నిర్వహించనున్న కార్యక్రమానికి మండలి చైర్మెన్ సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, సబ్ కమిటీ కో-చైర్మెన్ దామోదర రాజనర్సింహా, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఇతర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక సర్వే తీరును వివరించనున్నట్టు తెలిపారు.

Next Story