HYD: వర్షం ఎఫెక్ట్.. విద్యుత్ సరఫరాలో అంతరాయం

by Gantepaka Srikanth |

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా శుక్రవారం మధ్యాహ్నం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి గాను పలు ప్రాంతాల్లో దాదాపు 270 ఫీడెర్ల పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది.

HYD: వర్షం ఎఫెక్ట్.. విద్యుత్ సరఫరాలో అంతరాయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా శుక్రవారం మధ్యాహ్నం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి గాను పలు ప్రాంతాల్లో దాదాపు 270 ఫీడెర్ల పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. భారీ వర్షాలకు ఒక్కసారిగా చెట్లు కూలడం కారణంగా ఈ అంతరాయం ఏర్పడింది. సుమారుగా దాదాపు 200 ఫీడర్ల పరిధిలో అరగంట వ్యవధిలో విద్యుత్​సరఫరాను అధికారులు, సిబ్బంది పునరుద్ధరించారు. కాగా, హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు పడడంతో పాటు ఇతర సమస్యలతో సరఫరా పునరుద్ధరణలో కొంత సమయం ఎక్కువ తీసుకుంది. అయితే మెహదీపట్నం, అమీర్‌పేట్ మలక్ పేట్, హబ్సిగూడ, రామ్ నగర్ వంటి కొన్ని ప్రాంతాల్లో ట్రాన్స్ ఫార్మర్‌లలో సాంకేతిక లోపం కారణంగా సరఫరా పూర్తిగా నిలిచింది. ఈ క్రమంలో అధికారులు స్పందించి అన్ని ఫీడర్లలో విద్యుత్​సరఫరాను సాధారణ స్థితికి తీసుకొచ్చారు. డీటీఆర్ స్థాయిలో నమోదైన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాల్సిందిగా దక్షిణ తెలంగాణ విద్యుత్​పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్​ఫరూఖీ క్షేత్ర స్థాయి సిబ్బందిని ఆదేశించారు. విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో పునరుద్ధరణ పనులు వేగంగా జరిగాయని తెలిపారు.ల

Next Story