- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అజారుద్దీన్ మంత్రి పదవిపై వీడని ఉత్కంఠ.. సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. దీంతో మంత్రి అజారుద్దీన్ పదవి ఉంటుందా ఊడుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం వ్యవహారం మరోసారి ఇంట్రెస్టింగ్‍గా మారింది. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రొఫెసర్ కోదండరాం, మహమ్మద్ అజారుద్దీన్‌ల పేర్లపై గవర్నర్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో భేటీ అయ్యారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అజారుద్దీన్ మంత్రిగా కొనసాగాలంటే ఈ నెలాఖరులోగా ఎమ్మెల్సీ కావాల్సిన అనివార్యత ఏర్పడిన నేపథ్యంలో శివప్రతాప్ శుక్లా నిర్ణయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై దాసోజు శ్రవణ్ సహా మరికొంతమంది దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాల సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అనంతరం తదుపరి విచారణ విచారణ జులై 22వ తేదీకి వాయిదా పడింది వాయిదా వేసింది. సుప్రీంకోర్టు విచారణ వాయిదాతో అజారుద్దీన్ మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.






