అప్డేట్ అవుతున్న తపాలా శాఖ... జెన్ జీ థీమ్ లో పోస్టాఫీస్

by Muthe.Rajitha |

మారుతున్న కాలంతోపాటు, యువతరం ఆలోచనలు అందిపుచ్చుకుంటూ తపాలా శాఖ కూడా అప్డేట్ అవుతోంది.

అప్డేట్ అవుతున్న తపాలా శాఖ... జెన్ జీ థీమ్ లో పోస్టాఫీస్
X

దిశ, వెబ్ డెస్క్ : మారుతున్న కాలంతోపాటు, యువతరం ఆలోచనలు అందిపుచ్చుకుంటూ తపాలా శాఖ కూడా అప్డేట్ అవుతోంది. వేగంగా సేవలు అందించేందుకు జెన్ జీ థీమ్ పేరుతో తెలంగాణలోనే మొదటి పోస్టాఫీస్ ఏర్పాటు చేసింది. వరంగల్‌లోని ఎన్‌ఐటీలో విద్యార్థులకు వేగవంతమైన, ఆధునిక సేవలను అందించేందుకు జెన్‌జీ థీమ్‌ పోస్టాఫీస్ ఏర్పాటు చేశారు. ఈ ఆధునిక పోస్టాఫీసును హైదరాబాద్‌ రీజియన్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ సుమిత అయోధ్యతోపాటు నిట్‌ డైరెక్టర్‌ ఆచార్య బిద్యాధర్‌ సబూధి ప్రారంభించారు.

ఇక్కడ బ్యాంకింగ్ సేవలు, పార్సిల్‌ బుకింగ్, క్యూఆర్‌ కోడ్‌ చెల్లింపులు, బీమా, ఆధార్‌ సర్వీసులు, విద్యార్థులకు ప్రత్యేక రాయితీతో స్పీడ్ పోస్ట్‌ వంటి అనేక సౌకర్యాలతో పాటు ఉచిత వైఫై కూడా అందుబాటులో ఉంచారు. ఈ కొత్త కాన్సెప్ట్‌ కార్యాలయం గురించి అధ్యాపకులు, విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహిస్తోంది పోస్టల్ డిపార్ట్మెంట్.

Next Story