Vijayashanthi : సరైన సమయంలో పదవులు వస్తాయి : విజయశాంతి

by Muthe.Rajitha |

రాష్ట్రంలో ఎవరెవరికి పదవులు ఎప్పుడు రావాలో అధిష్టానం చూసుకుంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి(Congress MLC Vijayashanthi) స్పష్టం చేశారు.

Vijayashanthi : సరైన సమయంలో పదవులు వస్తాయి : విజయశాంతి
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ఎవరెవరికి పదవులు ఎప్పుడు రావాలో అధిష్టానం చూసుకుంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి(Congress MLC Vijayashanthi) స్పష్టం చేశారు. నేడు హైదరాబాద్‌(Hyderabad)లోని గాంధీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో విజయశాంతి మాట్లాడుతూ.. పదవుల విషయంలో తన వైఖరిని స్పష్టం చేశారు. సరైన సమయంలో పదవులు వస్తాయని, ఎవరికి పదవులు ఇవ్వాలో పార్టీ అధిష్ఠానానికి బాగా తెలుసని అన్నారు. గతంలో కొన్ని కమిటీల్లో తన పేరు లేకపోయినా, భవిష్యత్తులో మరో కమిటీలో అవకాశం దొరకవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

విజయశాంతి వ్యాఖ్యలను కాంగ్రెస్‌లో ఆమె ఓపిక, పార్టీ పట్ల నిబద్ధతకు నిదర్శనంగా రాజకీయ విమర్శకులు పేర్కొంటున్నారు. అయితే కొందరు మాత్రం విజయశాంతి పార్టీలో ఇంకా కీలక పాత్ర కోసం ఎదురుచూస్తోందని విమర్శిస్తున్నారు.

Next Story