- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BC Quota: హైకోర్టులో రిజర్వేషన్ల పిటిషన్... రాజకీయ పార్టీలకు మంత్రి పొన్నం కీలక విజ్ఞప్తి
బీసీ కోటాకు మద్దతు విషయంలో రాజకీయ పార్టీలకు మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సామాజిక కోణంలో ఆలోచించి ఈ కోటా తీసుకువచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. బీసీ కోటాకు అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని ఇప్పుడు అంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లోకల్ బాడీ ఎన్నికల కోసం (Telangana local body elections) నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఇవాళ గాంధీ భవన్‍లో మీడియాతో మాట్లాడిన ఆయన.. హైకోర్టు కూడా ఎన్నికల ప్రక్రియకు ఎక్కడా అడ్డు చెప్పలేదని అందుకు కోర్టుకు ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. ప్రజల ఆకాంక్షలు, పార్టీల సూచనల మేరకు ముందుకు వెళ్తున్నామని అందువల్ల బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నట్లుగా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు హైకోర్టుకు అఫిడవిట్ల రూపంలో తమ తమ అభిప్రాయాలను సమర్పించాలని విజ్ఞప్తి చేశారు.
పార్టీలను నేరుగా కలుస్తాం:
పార్టీల ఫ్లోర్ లీడర్లు, పార్టీ అధ్యక్షులకు బీసీ మంత్రులు, పార్టీ నేతలు నేరుగా వెళ్లి కలుస్తామన్నారు. ఇందులో రాజకీయ బేషజాలకు తావు లేదన్నారు. కోర్టులకు ఎవరైనా ఎప్పుడైనా వెళ్లవచ్చు. కానీ బీసీ రిజర్వేషన్ల అంశం సామాజిక కోణానికి సంబంధించినదని దయచేసి బీసీల నోటికాడి ముద్దను చెడగొట్టవద్దని ప్రాధేయ పడుతున్నారన్నారు. రిజర్వేషన్ల సీలింగ్ అంశంపై కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని పొన్నం ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో 80-90 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని గుర్తు చేశారు. ఈ రిజర్వేషన్ల కోసం మేము ఎన్నో పురిటినొప్పులు పడుతున్నామని బలహీన వర్గాల క్షేమం కోరే వారంతా ప్రభుత్వానికి మద్దతు తెలిపాలని కోరారు. బీసీ కోటా అమలైతే రాజకీయంగా వివిధ వర్గాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. బీసీరిజర్వేషన్ల వల్ల ఏ వర్గాలకు అన్యాయం జరగదని చెప్పారు.






