- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికారుల పనికి బండి సంజయ్ అడ్డు.. పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
వర్షాల కారణంగా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో భారీగా పంటనష్టం కలిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) పేర్కొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: వర్షాల కారణంగా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో భారీగా పంటనష్టం కలిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) పేర్కొన్నారు. గురువారం ఆయన వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్రం తక్షణమే సాయం అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక రూపొందిస్తున్నామని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లకుండా కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) తన సమావేశానికి పరిమితం చేశారని మండిపడ్డారు. తప్పకుండా పంటనష్టపోయిన రైతులు అందరినీ ఆదుకుంటాం, ఆర్థిక సాయం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ జిల్లాల పరిధిలో ఉన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. వేలాది ఎకరాల్లో ధాన్యం కొట్టుకుపోయిందని చెప్పారు. రోడ్లు మొత్తం దెబ్బతిన్నాయని.. ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని స్వయంగా ముఖ్యమంత్రిని కోరినట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు.






