KCR : శనివారం కేసీఆర్ ను మీట్ అవనున్న పొన్నం ప్రభాకర్

by Muthe.Rajitha |   (  Updated:2024-12-06 18:30:23  IST  )

కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఏర్పాటయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజా పాలన విజయోత్సవాలు(Triumph of public governance) జరుపుతున్న విషయం తెలిసిందే.

KCR : శనివారం కేసీఆర్ ను మీట్ అవనున్న పొన్నం ప్రభాకర్
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఏర్పాటయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజా పాలన విజయోత్సవాలు(Triumph of public governance) జరుపుతున్న విషయం తెలిసిందే. విజయోత్సవాలలో చివరి రోజైన డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరపనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని పార్టీల కీలక నేతలను ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్(KCR) ను విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించనున్నట్టు సమాచారం. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) శనివారం మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ ఫామ్ హౌజ్ కు వెళ్ళి, డిసెంబర్ 9న జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాల్సిందిగా ఆహ్వానం పలకనున్నారు.

Next Story