Ponnam Prabhakar: బండి సంజయ్‌పై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం.. మంత్రి పొన్నం ప్రభాకర్

by Ramesh Naini |

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు.

Ponnam Prabhakar: బండి సంజయ్‌పై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం.. మంత్రి పొన్నం ప్రభాకర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay Kumar) చేసిన కామెంట్స్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. నిజంగా హిందువులు అయితే బీజేపీకి ఓటు వేయాలని బండి సంజయ్ బహిరంగంగా మాట్లాడుతున్నారని, దీనిపై ఎలక్షన్ కమిషన్ (Election Commission) ఎందుకు మౌనంగా ఉందో అర్థం అవ్వడం లేదన్నారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) స్పష్టం చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హిందుత్వవాదులు బీజేపీకి ఓటు వేయాలన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై బ్యానర్లు కట్టడంపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మతపరమైన ప్రేరేపిత అంశాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేయాలని అనుకున్నాయి. కానీ మెజార్టీ రాదని తెలిసి బీఆర్ఎస్ తప్పుకుందన్నారు. దీంతో బీజేపీ హిందుత్వం పేరు మీద కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారని, ఇది రాజ్యాంగానికే ప్రమాదమని అన్నారు.

కాగా, హైదరాబాద్‌ స్థానిక ఎమ్మెల్సీ (Local Body MLC elections) ఎన్నికలను బీజేపీ సవాల్‌గా తీసుకుంది. ఈ ఎన్నికలో ఎంఐఎం, బీజేపీ మాత్రమే పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పోటీకి దూరంగా ఉన్నాయి. ప్రచారంలో భాగంగా నగరంలో ఎంఐఎంకు వ్యతిరేకంగా పలుచోట్ల బ్యానర్లు వెలిశాయి. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లలో ఈ బ్యానర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ‘గౌరవనీయులైన కార్పొరేటర్‌ గారికి మనవి. హిందూ దేవుళ్లను కించపరుస్తున్న ఎంఐఎంకు ఓటు వేయవద్దు. మీరు తప్పకుండా ఓటింగ్‌లో పాల్గొనాలి. ఎంఐఎంకు వ్యతిరేకంగా ఓటువేయాలి’ అని హిందువుల పేరుతో బ్యానర్లు వెలసిన విషయం తెలిసిందే.

Next Story