- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్టీసీ సమస్యలు చెప్పడానికి రెండు రోజుల అందుబాటులో ఉంటా: మంత్రి పొన్నం
ఆర్టీసీ సమస్యలపై, సంస్ధ సంక్షేమం కోరే ఎవరైనా తనకు ఎప్పుడైనా కలిసి సమస్యలు చెప్పుకోవచ్చని రెండు రోజుల పాటు అందుబాటులో ఉన్నానని రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ సమస్యలపై, సంస్ధ సంక్షేమం కోరే ఎవరైనా తనకు ఎప్పుడైనా కలిసి సమస్యలు చెప్పుకోవచ్చని రెండు రోజుల పాటు అందుబాటులో ఉన్నానని రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమవారం ఆయనను ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వద్దామ రెడ్డి, నరేందర్, స్వామికుమార్, పున్న హరికృష్ణ కలిసి సమస్యలు వినవించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలు వినడానికి తనతో పాటు సీఎం కార్యాలయం తలుపులు కూడా ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు. ప్రభుత్వం సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం ,ప్రయాణికుల సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుని సమస్యలు తొలుగుతున్నాయని ఇలాంటి సమయంలో సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ తీసుకుంటామని వెల్లడించారు. ఆర్టీసీకి 16 నెలలుగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశామని ఒకటి కూడా ఇబ్బంది పెట్టలేదని, సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడుతారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాలుగా ఆర్టీసీని నిర్వీర్యం చేసి ఒక్క బస్సు కొనుగోలు చేయలేదు ,ఒక్క ఉద్యోగం కూడా నియామకం చేయలేదన్నారు. సీసీఎస్, పీఎస్ నగదు గత ప్రభుత్వం వాడుకుందన్నారు.
ఉద్యోగులకు 2013 నుండి చెల్లించాల్సిన బాండ్ మొత్తం రూ.400 కోట్లు చెల్లించిందని, 2017 పే స్కేల్ 21 శాతం ఇచ్చిందని సంవత్సరానికి రూ. 412 కోట్లు భారం పడుతుందన్నారు. పీఎఫ్ఆర్గనైజేషన్ సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న రూ. 1039 కోట్లు చెల్లించామని, నెలవారీ పీఎప్కంట్రిబ్యూషన్ జనవరి 2024 నుండి క్రమం తప్పకుండా చెల్లిస్తుందని చెప్పారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సీసీఎస్ బకాయిలు ఉద్యోగులకు రూ. 345 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. అదే విధంగా ఎప్పడూ లేని విధంగా 1500 మంది కారుణ్య నియామకంతో పాటు 3038 మంది ఉద్యోగులను రిక్రూట్‌మెంట్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. కొత్త బస్సులు కొనుగోలు చేశాం ,తార్నాక ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీగా మార్చామని గుర్తు చేశారు.






