- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి శ్రీధర్ బాబుతో విభేదాలు.. క్లారిటీ ఇచ్చిన పొన్నం ప్రభాకర్
కాంగ్రెస్ పార్టీ(Telangana Congress)లో ఎలాంటి గ్రూపులు లేవని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) క్లారిటీ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ(Telangana Congress)లో ఎలాంటి గ్రూపులు లేవని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) క్లారిటీ ఇచ్చారు. శనివారం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడారు. మంత్రులంతా యూనిటీగా ఉన్నారు.. ఎక్కడా విభేదాలు లేవని అన్నారు. అడ్లూరి లక్ష్మణ్ విషయంలో కూడా నేనెక్కడా తప్పు చేయలేదు. కానీ.. లక్ష్మణ్ బాధపడ్డారని తెలిసి సారీ చెప్పాను అని అన్నారు. శ్రీధర్ బాబు(Sridhar Babu)తో నాకు విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. మేము ఇద్దరం మంచి స్నేహితులం అని చెప్పారు. నా మంత్రి పదవి ఇంకొకరు ఆశించడంలో తప్పులేదు.. కానీ అర్హత ఉంది కాబట్టే నాకు పదవి వచ్చిందని అన్నారు. దండుపాళ్యం బ్యాచ్ అంటున్న వాళ్లు అందరూ ముందు.. సొంత బిడ్డ ఆరోపణలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. ఆ బకాయిలు చెల్లించడానికే మాకు లెక్క సరిపోతోందని అన్నారు.
ఇంతటి కష్టపరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.. సన్నబియ్యం ఇస్తున్నాం.. ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణం కల్పించాం.. 65 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం.. ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం.. రేషన్ కార్డులు ఇస్తున్నాం.. ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో బీజేపీ ఎంపీలు విఫలం అయ్యారని విమర్శించారు. ఇద్దరు కేంద్రమంత్రులుగా ఉన్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాలేదని.. కానీ జూబ్లీహిల్స్‌లో మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో మేము ఇచ్చిన హామీకి ఇంకా కట్టుబడే ఉన్నామని స్పష్టం చేశారు. కావాలనే కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని.. బీజేపీ వైఖరిని ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని అన్నారు.






