- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ponnala Lakshmaiah: నిర్మలా సీతారామన్ అంటే ఓ గౌరవం ఉంది
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాజకీయాలు చేస్తే తాము కూడా రాజకీయాలు చేస్తామని.. తెలంగాణపై విషం చిమ్మే మాటలు ఇప్పటికైనా మానుకోవాలని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సూచించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాజకీయాలు చేస్తే తాము కూడా రాజకీయాలు చేస్తామని.. తెలంగాణపై విషం చిమ్మే మాటలు ఇప్పటికైనా మానుకోవాలని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సూచించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎనిమిది సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన మహిళగా సీతారామన్ అంటే గౌరవం ఉందని.. తెలంగాణ ఆర్థిక పరిస్థితులపై ఆమె చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. ఆర్థిక వ్యవస్థలో అప్పులు కూడా భాగమే అని.. దేశ ఆదాయంలో 85 శాతం అప్పులు చేస్తున్న మీరా తెలంగాణ గురించి మాట్లాడేది అని ప్రశ్నించారు. దేశంలో పన్నెండు ప్రధాన రాష్ట్రాల కన్నా తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగుందన్నారు. ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా చెప్పుకునే దేశాల్లో అప్పులు ఎలా ఉన్నాయో సీతారామన్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో కోత పెట్టి మీరా మాట్లాడేది అని నిలదీశారు. బడ్జెట్‌లో బిహార్ గురించే చెప్పారని.. తెలంగాణ గురించి ఒక్క మాటైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.






